రక్షకుడే.. భక్షకుడు!
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:04 AM
ఓ ప్రధానోపాధ్యాయుడు పాఠశాల వస్తువులను అమ్మి సొమ్ముచేసుకుంటుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.
పాఠ్యపుస్తకాలు, బెంచీలు అమ్మజూసిన ప్రధానోపాధ్యాయుడు
పట్టుకొని నిలదీసిన గ్రామస్థులు
షాబాద్, అక్టోబరు 1: ఓ ప్రధానోపాధ్యాయుడు పాఠశాల వస్తువులను అమ్మి సొమ్ముచేసుకుంటుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. మంగళవారం షాబాద్‌లోని జడ్పీ బాలుర పాఠశాలలోని పాత పుస్తకాలు, బెంచీలు, ఇతర సామగ్రిని హెచ్‌ఎం గోవిందు అమ్మజూశాడు. దీంతో గ్రామస్థులు అతడిని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు కోసం వెళ్లారు. ఈ లోపు హెచ్‌ఎం పాత పుస్తకాలు, సామగ్రిని అమ్మేందుకు ఈ నెల 23న తీర్మానించినట్లు రిజిస్టర్‌లో రాసి తోటి టీచర్ల సంతకాలు తీసుకున్నాడు. ఉపాధ్యాయులను నిలదీయగా.. మంగళవారమే సంతకాలు చేశామని అంగీకరించారు. దీనిపై డీఈవోకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులన్నారు. టీసీలకు, గెజిటెడ్ సంతకాలకు హెచ్‌ఎం రూ.500 వసూలు చేస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. బదిలీ అయిన టీచర్లకు సర్వీసు బుక్కులిచ్చేందుకు సైతం డబ్బు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే హెచ్‌ఎం గోవిందు రాజేంద్రనగర్‌లో పనిచేసినప్పుడు కూడా బియ్యం, ఇతర సామాన్లు అమ్ముకున్నాడనే ఆరోపణలున్నాయి.