తాపీమేస్ర్తీ కొడుకు డీఎస్సీలో టాప్
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:02 AM
తాపిమేస్త్రి కుమారుడు ప్రభుత్వం సోమవారం ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించాడు.
చౌదరిగూడ, అక్టోబరు 1: మారుమూల గ్రామ యువకుడు, తాపిమేస్త్రి కుమారుడు ప్రభుత్వం సోమవారం ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. జిల్లేడ్-చౌదరిగూడ మండలం ఎల్కగూడకు చెందిన బోయ కళమ్మ-వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు చెన్నయ్య, రెండో కుమారుడు అంజయ్య. చెన్నయ్య టెన్త్ వరకు ఇంద్రనగర్ జడ్పీహెచ్‌ఎ్‌సలో, ఇంటర్ మొగిల్‌గిద్ద ప్రభుత్వ కాలేజీలో చదివాడు. డీఎడ్ పరిగిలోని పల్లవి కాలేజీలో పూర్తిచేశాడు. ఎస్జీటీ పోస్టుకు సొంతంగా ప్రిపేర్ అయి మొదటి ర్యాంక్ సాధించాడు. ర్యాంకర్ చెన్నయ్యను మంగళవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ సన్మానించారు. నాయకులు రాజు, వెంకట్‌నర్సింహారెడ్డి, బందెయ్య, బల్వంతరెడ్డి, వేణుగోపాల్, భాస్కర్ పాల్గొన్నారు.
నాలుగో ర్యాంక్ సాధించిన ప్రసన్న
కేశంపేట: సంతాపూర్‌నకు చెందిన కె.బాలరాజు-మంజుల దంపతులు కూతురు కె.ప్రసన్న డీఎస్సీలో సత్తా చాటింది. డీఎస్సీ-ఎస్జీటీ విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించింది. ప్రసన్న పదో తరగతి వరకు కొత్తపేట జడ్పీ పాఠశాలలో చదివింది. షాద్‌నగర్‌లో ఇంటర్, హైదారాబాద్‌లోని నేరెడ్‌మెట్ ప్రభుత్వ కాలేజీలో డీఈడీ పూర్తిచేసింది.