ప్రకృతి సాగుకు సహకారం
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:42 PM
ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అభివృద్ధికి తన వంతు సహకార ం అందిస్తానని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని బూర్గుగడ్డ ప్రాంతంలోని సౌభాగ్య గోసధన్ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు.
శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్
ధారూరు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అభివృద్ధికి తన వంతు సహకార ం అందిస్తానని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని బూర్గుగడ్డ ప్రాంతంలోని సౌభాగ్య గోసధన్ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన సేంద్రియ పంటలను, పండ్ల తోటలను, గోవులను పరిశీలించారు. పంటల సాగు విధానం, పశుపోషణ గురించి నిర్వాహకుడు విజయ్‌రామ్ స్పీకర్‌కు వివరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పంటల సాగు విధానం బాగుందని, తమ వ్యవసాయ క్షేత్రంలో కూడా ప్రకృతి వ్యవసాయం సాయం చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ క్షేత్ర ంలో విజయరామ్ సాగు చేస్తున్న పంటల గురించి ఎక్కడికి వెళ్లినా ప్రజలకు, రైతులకు వివరిస్తానని ఆయన తెలిపారు. వ్యవసాయ క్షేత్రం అభివృద్ధికి ప్రత్యేక నిధులను మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ధారూరు మార్కెట్ కమిటీ చెర్మన్ విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, కిషోర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.