Share News

విఘ్నేషుడికి విశేష పూజలు

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:57 PM

మండల కేంద్రంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ యూత్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పార్వతి తనయుడు గణపయ్యను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి ఏసీపీ గిరికుమార్‌, డీసీపీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బిచ్యానాయక్‌, ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

విఘ్నేషుడికి విశేష పూజలు
చేవెళ్ల : న్యూ జర్నలిస్ట్‌ కాలనీలోని వినాయకుడి నిమజ్జనంలో పాల్గొన్న భక్తులు

కనుల పండువగా వినాయక నిమజ్జనాలు

పెద్దఎత్తున పాల్గొన్న ప్రజాప్రతినిధులు, భక్తులు

కడ్తాల్‌, సెప్టెంబరు 15 : మండల కేంద్రంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ యూత్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పార్వతి తనయుడు గణపయ్యను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి ఏసీపీ గిరికుమార్‌, డీసీపీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బిచ్యానాయక్‌, ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పూజల అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లే్‌షగౌడ్‌, వరికుప్పల రాజు, నర్సింహ, దేవేందర్‌గౌడ్‌, రాజు. రవి, రామచంద్రయ్య, మహేష్‌, తదితరులున్నారు. కాగా, బాలాపూర్‌ గణేష్‌ మంటపాన్ని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహలు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బడంగ్‌పేట మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, కడ్తాల్‌ మండల పరిధిలోని మక్తమందారం వినాయక మంటపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులకు దుస్తులు పంపిణీ చేశారు. ఎన్‌ఎ్‌సయూఐ మండలాధ్యక్షుడు షాబొద్దీన్‌ వినాయక నిమజ్జన వేడుకుల సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులకు వాటిని సమకూర్చి అందించారు. నాయకులు గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, హన్‌మాన్‌నాయక్‌, ల కృతి నాయక్‌, సత్యంయాదవ్‌, అంజయ్య, నారాయణ, యాదగిరి, శ్రీకాంత్‌, మురళీ, శేఖర్‌, గోపాల్‌, నర్సింహగౌడ్‌, బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల : వారం రోజులుగా భక్తులచే పూజలందుకున్న వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఆదివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాల్లోని అన్ని గ్రామాల్లో విఘ్నేశ్వరుడి నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశుడి లడ్డూ ప్రసాదానికి నిర్వాహకులు వేలం నిర్వహించారు. భక్తులు లడ్డూను పోటీపడి దక్కించుకున్నారు. నిమజ్జనం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చేవెళ్ల సీఐలు భూపాల్‌శ్రీధర్‌, ట్రాఫిక్‌ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

షాబాద్‌ : వినాయక ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామంలో సిద్ధి వినాయక మండపం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం భజరంగ్‌దళ్‌ విభాగ్‌ కన్వీనర్‌ గూడెం రమేశ్‌ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శేఖర్‌, మల్లేశ్‌, సాయి రాం, మహేశ్‌, శ్రీశైలం, నర్సింలు, రమేశ్‌, నర్సింలు, గ ణేశ్‌, నరేశ్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌ : తొమ్మిది రోజులుగా కొలువుతీరిన ఘననాథులకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని లక్ష్మినర్సింహ కాలనీలోని వినాయక యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కల్వ యాదగిరీష్‌, తాటి శ్రీధర్‌, సాయి రాఘవేందర్‌తో పాటు, యెడ్ల నరేందర్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

యాచారం : మండల కేంద్రంలో ఏడు రోజులుగా వినాయక మంటపాల వద్ద బీఆర్‌ఎస్‌ మండల నాయకుడు మహ్మద్‌ ఖాజుద్దీన్‌ శనివారం రాత్రి భక్తులకు అన్నదానం చేశారు. ఉదయం పలువురు భక్తులు పూజలు చేశారు. స్వామివారికి పూజలు చేసిన వారిలో మారోజు శ్రీనివా్‌సచారి, డాక్టర్‌ యాదగిరిరెడ్డి, బి.విజయ్‌ భాస్కర్‌గుప్తా తదితరులున్నారు. కాగా, రాత్రి పది గంటలకు పూజలు, భజనలు ముగించాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు అన్నారు. ఆదివారం రాత్రి యాచారం కుర్మిద్దలోని గణేష్‌ మండపంలో పూజలు చేసి భక్తులతో పాటు ఇతర మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ సీఐ నర్సింహారావు తదితరులు ఉన్నారు.

చౌదరిగూడ : జిల్లేడ్‌- చౌదరిగూడ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఆదివారం వినాయక మండపాల వద్ద తొమ్మిది రోజులు పూజలందుకున్న వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బొజ్జ గణపయ్యను నృత్యాలు, ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. కమిటీల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రంలో ఆర్యవైశ్య వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించగా.. మొదటి లడ్డూను గ్రామానికి చెందిన గోపిశెట్టి మహేష్‌, అక్షయ్‌కుమార్‌లు రూ.లక్షా 36 వేలు, రెండవ లడ్డూను ఆకారపు యాదగిరి రూ.లక్షా 25వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వినాయక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కందుకూరు : మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద భక్తులు ఘనంగా పూజలు చేస్తున్నారు. శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం కొత్తగూడ, జైత్వారం, కందుకూరు, దెబ్బడగూడ, కందుకూరు చౌరస్తాల్లోని మండపాల వద్ద భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమానికి సీఐ సీతారాం, ఎస్సై సైదులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ జడ్పీటీసీలు బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, బీజేపీ నాయకులు ఎల్మటి దేవేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 11:57 PM