Share News

నిఖిల కన్‌స్ట్రక్షన్స్‌కు ‘సౌత్‌ ఇండియా బెస్ట్‌ బిల్డర్‌’ అవార్డు

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:01 AM

నిఖిల కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌(ఎన్‌సీడీ-మోకిల) హైదరాబాద్‌ ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటింది. ప్రఖ్యాత ఇండో ఆరేబియన్‌ బెస్ట్‌ లీడర్స్‌(బిల్డర్‌) అవార్డును సంస్థ దక్కించుకుంది. ఇటీవల ఆసియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన సమ్మిట్‌లో అవార్డును ఎన్డీసీ చైర్మన్‌ శ్రీనివాసరావు అందుకున్నారు.

నిఖిల కన్‌స్ట్రక్షన్స్‌కు ‘సౌత్‌ ఇండియా బెస్ట్‌ బిల్డర్‌’ అవార్డు
ఇండో-అరబ్‌ లీడర్‌ సమ్మిట్‌ అవార్డుతో ఎన్‌సీడీ చైర్మన్‌ శ్రీనివాసరావు

శంకర్‌పల్లి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): నిఖిల కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌(ఎన్‌సీడీ-మోకిల) హైదరాబాద్‌ ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటింది. ప్రఖ్యాత ఇండో ఆరేబియన్‌ బెస్ట్‌ లీడర్స్‌(బిల్డర్‌) అవార్డును సంస్థ దక్కించుకుంది. ఇటీవల ఆసియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన సమ్మిట్‌లో అవార్డును ఎన్డీసీ చైర్మన్‌ శ్రీనివాసరావు అందుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గుర్తుంపు పొందిన నిఖిల కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థ.. ఇటీవల దుబాయ్‌లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘సౌత్‌ ఇండియా బెస్ట్‌ బిల్డర్‌’ అవార్డును సాధించామని సంస్థ చైర్మన్‌ ఆదవారం తెలిపారు. మోకిలలో సంస్థ చేపట్టే ప్రాజెక్టులు పూర్తిగా గ్రీన్‌ బిల్డింగ్‌లన్నారు. అలాగే పోడియం పార్కింగ్‌, టెర్రస్‌ స్విమ్మింగ్‌పూల్‌, గోల్ఫ్‌ కోర్సులు, క్లబ్‌హౌజ్‌లు, వాకింగ్‌ ఏరియా తదితర అధునాతన సౌకర్యాలతో ఇళ్లను నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. త్వరలో దుబాయ్‌లోనూ సంస్థ కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పారు. అవార్డు వచ్చేందుకు, సంస్థను ఉన్నత స్థానంలో నిలిపేందుకు తోడ్పడిన ప్రతొక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 12:01 AM