ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:04 AM
ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం హైతాబాద్‌లో గృహజ్యోతి పథకానిని విద్యుత్ వినియోగదారుల వివరాలు సేకరించారు.
షాబాద్, ఫిబ్రవరి 12 : ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం హైతాబాద్‌లో గృహజ్యోతి పథకానిని విద్యుత్ వినియోగదారుల వివరాలు సేకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేయనున్న గృహజ్యోతి పథకాన్ని పేద వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీటర్ రీడింగ్ తీసే సిబ్బందికి వినియోగదారులు ఆధార్/రేషన్‌కార్డు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈ నరే ందర్, గ్రామస్థులు శ్రీనివా్‌సరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత విద్యుత్‌కు విధిగా దరఖాస్తు చేసుకోవాలి
యాచారం: పేదలకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం వినియోగదారులు దరఖాస్తు చేసుకోవాలని ఇబ్రహీంపట్నం డీఈ యాదగిరి తెలిపారు. సోమవారం మాల్‌లో ఆయన వినియోగదారులతో మాట్లాడారు. ఆధార్‌కార్డు, రేషన్ కార్డుల కాపీలు, ఫోన్‌నంబర్, మీటర్ బి ల్లు అందజేయాలన్నారు. వివరాలను ఆన్‌లైన్ చేస్తామని చెప్పారు. ఆయ న వెంట ట్రాన్స్‌కో ఏఈ సందీప్, గ్రామస్తులు ఉన్నారు.