నిషేధిత పదార్థాలు విక్రయం.. ముగ్గురు రిమాండ్
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:59 PM
అమెజాన్ కంపెనీలో కార్మికులకు అధిక ధరలకు నిషేధిత గసగసాలతో తయారైన కేజీ పప్పీస్ట్రా, 140 గ్రాముల పప్పీస్ట్రా పౌడర్ విక్రయించేందుకు యత్నించిన వారిని హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకొని ఆదివారం రిమాండ్‌కు పంపారు.
యాచారం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): అమెజాన్ కంపెనీలో కార్మికులకు అధిక ధరలకు నిషేధిత గసగసాలతో తయారైన కేజీ పప్పీస్ట్రా, 140 గ్రాముల పప్పీస్ట్రా పౌడర్ విక్రయించేందుకు యత్నించిన వారిని హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకొని ఆదివారం రిమాండ్‌కు పంపారు. రాజస్థాన్ నుంచి సురే్‌షకుమార్, దినే్‌షకుమార్, సునిల్‌కుమార్ అనే వ్యక్తు లు కిలో, పప్పీస్ట్రా, 140 గ్రాముల పప్పీస్ట్రాపౌడర్ తీసుకొచ్చి నగర శివారులోని నాదర్‌గుల్‌లో వారు నివాసముంటున్న ఇంటిలో భద్రపరిచారు. ఈక్రమంలో హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగరికంచ సమీపంలోని అమెజాన్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు విక్రయించడానికి వెళుతుండగా పోలీసులకు సమాచారమందగా వారు అదుపులోకి తీసుకొని ఆదివారం రిమాండ్‌కు పంపినట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు, ఎస్సై తేజంరెడ్డి చెప్పారు.