Share News

సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములవ్వాలి

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:02 PM

సమాజ సేవాలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని సినీ నటుడు సోనూసూద్‌ పిలుపునిచ్చారు.

సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములవ్వాలి
కేజీబీవీ పాఠశాలలో మాట్లాడుతున్న సోనూసూద్‌

-పాల్మాకుల కేజీబీవీలో సందడి చేసిన సోనుసూద్‌

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవాలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని సినీ నటుడు సోనూసూద్‌ పిలుపునిచ్చారు. శంషాబాద్‌ మండల పరిధిలోని పాల్మాకుల కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలో సామాజికవేత్త పట్టణానికి చెందిన సిద్ధురెడ్డి సొంత నిధులతో వంట గది, మూత్ర శాలలు, తాగు నీరు కోసం నల్లాలు ప్లే గ్రౌండ్‌ తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సోనూసూద్‌ మీడియాతో మాట్లాడారు.

సంపదలో కొంత..

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మిత్రుడు సిద్దురెడ్డిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంతో మంది ధనవంతులు ఉన్నా పేదలకు సహాయం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమాజనికి తమ వంతు సహాయం చేస్తే ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పడుతాయన్నారు. సిద్ధు రెడ్డి మాట్లాడుతూ తన సంపదలో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్ధులతో సోనూసూద్‌ సెల్ఫీలు దిగి సందడి చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:02 PM