రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:59 PM
మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో ఆదివారం రజకసంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఐలమ్మ హైదరాబాద్‌లో కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ప్రకటించడంతో పాటు ఆమె మనవరాలిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేశారు.
కడ్తాల్, సెప్టెంబరు 15 : మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో ఆదివారం రజకసంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఐలమ్మ హైదరాబాద్‌లో కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ప్రకటించడంతో పాటు ఆమె మనవరాలిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేశారు. రజక సంఘం గ్రామ కమిటీ అధ్యక్షుడు సోమరాజు రవికుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రె్‌సకు సీఎంకు అనుకూలంగా నినాదాలు చేశారు. రజకుల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరయ్య, జనార్దన్, పాండు, దేవేందర్, శ్రీ శైలం, రవి, శివ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.