మోటార్ సైకిళ్ల దొంగ రిమాండ్
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:29 PM
ఇళ్లు, షాపులు, బస్టాండ్, వైన్‌షాపులు, రైల్వేస్టేషన్ వద్ద నిలిపిన వాహనాలను దొంగిలించి అమ్ముకుంటున్న దొంగను బుధవారం అరె్‌స్టచేసి రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.
షాద్‌నగర్ రూరల్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఇళ్లు, షాపులు, బస్టాండ్, వైన్‌షాపులు, రైల్వేస్టేషన్ వద్ద నిలిపిన వాహనాలను దొంగిలించి అమ్ముకుంటున్న దొంగను బుధవారం అరె్‌స్టచేసి రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. షాద్‌నగర్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన సూరమోని శ్రీశైలం పెయింటర్. కాగా, చిల్కమర్రికి చెందిన గురువుల రమేష్ షాద్‌నగర్‌లో పాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈనెల 24న ఇంటి ముందు నిలిపిన మోటార్‌సైకిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లినట్లు ఫిర్యాదు చేయగా విచారణ చేసి నిందితుడు శ్రీశైలంను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.