శివాలయాల్లో కార్తీక పూజలు
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:50 PM
కార్తీక చివరి శుక్రవారం కావడంతో యాచారం మండలంలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
యాచారం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : కార్తీక చివరి శుక్రవారం కావడంతో యాచారం మండలంలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నందీశ్వరాలయం, శివాలయం, ఓంకారేశ్వరాలయం, తక్కళ్లపల్లి గుట్టపై వెలిసిన శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం, రుద్రహోమం, రుద్రాభిషేకం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. పార్వతీమాతకు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమాలలో పి.రవీందర్‌గుప్త, నారాయణరెడ్డి, సతీష్, వెంకటరెడ్డి తదితరులున్నారు.