Share News

చేవెళ్ల అభివృద్ధి కోసం మరో అవకాశం ఇవ్వండి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:02 AM

ప్రజలకు సేవ చేయాలనే తాను రాజకీయల్లోకి వచ్చానని, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్న తనను ప్రజలు మరోసారి ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు.

చేవెళ్ల అభివృద్ధి కోసం మరో అవకాశం ఇవ్వండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రంజిత్‌రెడ్డి

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం : పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

చేవెళ్ల, ఏప్రిల్‌ 2 : ప్రజలకు సేవ చేయాలనే తాను రాజకీయల్లోకి వచ్చానని, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్న తనను ప్రజలు మరోసారి ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో నియోజకవర్గ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం పార్టీ ఇన్‌చార్జి భీంభరత్‌ అధ్యక్షతన నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో నిలిచేలా రేవంత్‌రెడ్డి వంద రోజుల పాలనలో ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. బూత్‌స్థాయి నాయకులు పార్టీకి గుండెకాయ లాంటివారని అన్నారు. కాంగ్రెస్‌లో చేరడం సంతోషకరంగా ఉందన్నారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారి పనులు త్వరలోనే పనులు చేపడుతారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. వికారాబాద్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవం తేవాలన్నారు. 200యూనిట్ల వరకు ఎవరూ కరెంటు బిల్లు కట్టొద్దన్నారు. లోక్‌సభ ఎన్నికలు కాగానే పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ జైలుకు పోవడం ఖాయం అన్నారు. సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు పి.వెంకట్‌స్వామి, పీసీబీ సభ్యుడు సత్యనారాయణరెడ్డి, పీసీసీ కార్యదర్శులు జానార్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాయకులు వసంతం, దర్శన్‌, జ్యోత్స్న, బల్వంతరెడ్డి, బండారు ఆగిరెడ్డి, డి.వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, రాంచంద్రారెడ్డి, డి.సమతారెడ్డి, సరితారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బి.శైలజాఆగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా తన 60సంవత్సరాల జీవితంలో తనపై ఒక్క కేసు కూడా లేదని, ఓర్వలేని మాజీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనపై కేసు పెట్టారని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజల్లో కన్పించకుండా ఇప్పుడు ఓట్ల కోసం ఆయన గ్రామాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. గతంలో ఎంపీగా విశ్వేశ్వర్రెడ్డి ఏమీ చేయలేదనేది ప్రజలకు తెలుసన్నారు. అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలని ఎంపీ సవాల్‌ విసిరారు. అబద్ధాలతో విశ్వేశ్వేర్‌రెడ్డి మోసం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - Apr 03 , 2024 | 12:02 AM