పేలిన ఫ్రిజ్.. తప్పిన ముప్పు
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:38 PM
చౌడాపూర్ మండలం చాకల్‌పల్లి గ్రామంలో గ్యాస్ సమస్యతో ఫ్రిజ్ పేలింది.
కులకచర్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): చౌడాపూర్ మండలం చాకల్‌పల్లి గ్రామంలో గ్యాస్ సమస్యతో ఫ్రిజ్ పేలింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చెంచు చెన్నయ్య సోమవారం పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్రిజ్ గ్యాస్ సమస్యతో పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.