నీవు లేకున్నా.. నీ కళ్లు ప్రపంచాన్ని చూడాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:07 AM
చిన్నతనంలోనే లోకం విడిచిపోయిన తన కుమారుడి కళ్లు ఇంకొన్నాళ్లు ఈ ప్రపంచాన్ని చూడాలని ఓ తండ్రి కోరుకున్నాడు. ప్రమాదంలో మరణించిన తన కుమారుడి కళ్లను దానం చేసి దాతృత్వం చాటుకున్నాడు.
ఓ తండ్రి కోరిక..
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన కుమారుడి కళ్లు దానం
నందిగామ, సెప్టెంబరు 4: చిన్నతనంలోనే లోకం విడిచిపోయిన తన కుమారుడి కళ్లు ఇంకొన్నాళ్లు ఈ ప్రపంచాన్ని చూడాలని ఓ తండ్రి కోరుకున్నాడు. ప్రమాదంలో మరణించిన తన కుమారుడి కళ్లను దానం చేసి దాతృత్వం చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే నందిగామ మండలం మేకగూడకు చెందిన ప్రశాంత్‌యాదవ్(26) కారు డ్రైవింగ్ చేస్తూ హైదరాబాద్‌లో ఉండేవాడు. ఈనెల 1న స్వగ్రామం మేకగూడకు వచ్చాడు. 3వ తేదీన మేకగూడ నుంచి కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వకు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రశాంత్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హైదబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. కోమాల్లోకి వెళ్లిన ప్రశాంత్ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. తన కుమారుడి మరణం తీరని లోటని, అయినా తన కళ్లు ఈ ప్రపంచాన్ని చూడాలని భావించిన తండ్రి ఆంజనేయులు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి సమాచారం ఇచ్చి కళ్లు దానంచేసి గొప్ప మనస్సు చాటుకున్నాడు. కాగా, ప్రశాంత్ మృతితో మేకగూడలో విషాదచాయలు అలుముకున్నాయి.