సెంట్రింగ్ మెటీరియల్ అపహరణ
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:11 AM
సెంట్రింగ్ మెటీరియల్ అపహరణకు గురైన సంఘటన బుధవారం శంకర్‌పల్లి మండలం మోకిల పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీ్‌సలు తెలిపిన వివరాల ప్రకారం..
చేవెళ్ల, సెప్టెంబరు 4 : సెంట్రింగ్ మెటీరియల్ అపహరణకు గురైన సంఘటన బుధవారం శంకర్‌పల్లి మండలం మోకిల పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీ్‌సలు తెలిపిన వివరాల ప్రకారం.. మోకిలలోని సార్క్ శేషాద్రి వెంచర్‌లో బిల్డింగ్ నిర్మించేందుకుగాను సెంట్రింగ్ మెటీరియల్‌ని మంగళవారం తీసుకొచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో రూ.2లక్షల విలువ గల మెటీరియల్‌ని ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం వెంచర్‌లో సెంట్రింగ్ మెటీరియల్ కన్పించకపోవడంతో వెంచర్ మేనేజర్ లక్ష్మణ్ పోలీ్‌సలకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.