నిర్మాణంలో ఉన్న ఇంట్లో నుంచి విద్యుత్ వైరు చోరీ
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:46 PM
నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి నుంచి విద్యుత్ వైర్లు చోరీ అయ్యాయి. ఈ ఘటన మంగళవారం నాగారం మున్సిపాలిటీ పరిధి బృందావన్ కాలనీలో జరిగింది.
కీసర రూరల్, అక్టోబరు 1: నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి నుంచి విద్యుత్ వైర్లు చోరీ అయ్యాయి. ఈ ఘటన మంగళవారం నాగారం మున్సిపాలిటీ పరిధి బృందావన్ కాలనీలో జరిగింది. బాధితుడు మనీ్‌షపటేల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగారం మున్సిపాలిటీ బృందావన్ కాలనీలోని ప్లాట్ నంబర్ 24, 25ల్లో నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో ఇంట్లో విద్యుత్ సరఫరాకు వైరింగ్ పని చేయించారు. కాగా మంగళవారం తెల్లవారు ఝామున 3గంటలకు ముగ్గురు దొంగలు ఇంట్లో చొరబడి వైర్‌పు పూర్తిగా అపహరించుకు పోయారు. వారి కదలికలు సీసీ కెమెరాల్లో పూర్తిగా రికార్డైనట్లు వివరించారు. దొంగలు ఎత్తుకెల్లిన వస్తువు విలువ దాదాపు రూ.4లక్షల వరకు ఉంటుందని ఆవేధన వ్యక్తం చేసారు. పోలీసులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు.