వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:43 PM
వ్యక్తి అదృశ్యమైన సంఘటన శంషాబాద్ మండలంలోని ఘన్సిమియాగూడ గ్రామంలో జరిగింది. ఎస్సై నరేందర్‌రెడ్డి కథనం మేరకు..
శంషాబాద్ రూరల్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వ్యక్తి అదృశ్యమైన సంఘటన శంషాబాద్ మండలంలోని ఘన్సిమియాగూడ గ్రామంలో జరిగింది. ఎస్సై నరేందర్‌రెడ్డి కథనం మేరకు.. ఘన్సిమియాగూడకు చెందిన గుగ్గిళ్ల విఠలయ్య(65)కు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడూ ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. ఈక్రమంలో గత నెల 19న విఠలయ్య ఇంటి నుంచి వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఆచూకీ కోసం తెలిసినవారు, బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోయింది. విఠలయ్య భార్య భారతమ్మ గురువారం శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.