Share News

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:12 AM

మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి అదృశ్యమైన సంఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం

చేవెళ్ల, సెప్టెంబర్‌ 4 : మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి అదృశ్యమైన సంఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఈర్లపల్లికి చెందిన ఎండీ దస్తరిగి చెల్లెలు(16)కు మతిస్థిమితం సరిగా ఉండదు. ఈనెల 3న అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు గమనించగా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం సాయంత్రం యువతి అన్న దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 12:12 AM