గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:55 PM
గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వర్తి గ్రామ శివారులోని లక్ష్మీపతి శాస్ర్తి పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తి శవం ఆదివారం లభ్యమైందని తెలిపారు.
శంకర్‌పల్లి, సెప్టెంబరు 15 : గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వర్తి గ్రామ శివారులోని లక్ష్మీపతి శాస్ర్తి పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తి శవం ఆదివారం లభ్యమైందని తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50-60 సంవత్సరాల మధ్య ఉంటుందని, 4-5రోజుల క్రితమే చనిపోవడంతో శరీరం పూర్తిగా కుళ్లిపోయిందని చెప్పారు. మృతిడి ఒంటిపై తెల్లని షర్టు.. ఉండగా శరీరంపై ఎలాంటి ఆనవాళ్లు లేవు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. అనుమాన్పాద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.