Share News

పొరపాట్లు లేకుండా డాటా ఎంట్రీ చేయాలి

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:40 PM

కుల గణన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పొరపాట్లు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎంపీడీవో రవిచంద్రకుమార్‌ రెడ్డి సూచించారు.

పొరపాట్లు లేకుండా డాటా ఎంట్రీ చేయాలి
యాచారం : డాటా ఎంట్రీ చేస్తున్న ఆపరేటర్లు

కేశంపేట/యాచారం, నవంబరు 29(ఆంద్రజ్యోతి): కుల గణన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పొరపాట్లు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎంపీడీవో రవిచంద్రకుమార్‌ రెడ్డి సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాటా ఎంట్రీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. యాచారం మండలంతో పాటు 24 గ్రామపంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో 15808 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. సర్వే వివరాల నమోదుకు యాచారంలో 30 కంప్యూటర్లతో.. ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మరో 80 కంప్యూటర్లతో డాటా ఎంట్రీ చేస్తున్నట్లు ఎంపీడీవో నరేందర్‌రెడ్డి తెలిపారు. సర్వే పత్రాలను ఎంట్రీ చేయడంలో రంగారెడ్డి జిల్లాలో యాచారం మండలం మొదటిస్థానంలో నిలిచిందని ఎంపీడీవో చెప్పారు.

Updated Date - Nov 29 , 2024 | 11:40 PM