ఓటరు జాబితా తయారీకి సహకరించాలి
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:46 PM
ఇంటింటి సర్వేకు తోడ్పాటును అందిస్తూ ఓటరు జాబితా పక్కాగా రూపొం దేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ శశాంక సూచించారు.
కలెక్టర్ శశాంక
రంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 11 : ఇంటింటి సర్వేకు తోడ్పాటును అందిస్తూ ఓటరు జాబితా పక్కాగా రూపొం దేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ శశాంక సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబరు 18 వరకు ఫ్రీ రివిజన్ యాక్టివిటీస్ నిర్వహిస్తామని, అందులో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి అక్టోబరు 29 న డ్రాప్ట్ పబ్లికేషన్ చేస్తామని తెలిపారు. దానికి పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్ 2025లో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారణ చేసుకుంటారని చెప్పారు. జనవరి 6న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, నాగార్జున, పార్టీల నాయకులు హరికృష్ణ, నెట్టు ధనుంజయ, జగదీష్ పాల్గొన్నారు.
అంగన్‌వాడీల్లో అవకతవకలు జరగకుండా చూడాలి
మహేశ్వరం: అంగన్‌వాడీ సెంటర్లలో అవకతవకలు జరగకుండా చూడాలని, ఆ బాధ్యత అంగన్‌వాడీ టీచర్లదేనని కలెక్టర్ శశాంక అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలతో పాటు బాలింతలు, గర్భిణులకు అందాల్సిన భోజనం, పాలు, గుడ్లు సరైన పద్ధతిలో అందిస్తున్నారా.. లేదా చూడాలని, వాటి సరఫరాలో ఏమాత్రం అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకో వాలని చెప్పారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ లోని పలు అంగన్‌వాడీ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆంగన్‌వాడీ సెంటర్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారికి ప్రతి రోజు ఏమేం ఆహారం అందిస్తున్నారని అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్ల లకు విద్యాబోధనతో పాటు ఆటలు, పాటలూ నేర్పించాల న్నారు. క్రమం తప్పకుండా పిల్లల ఆరోగ్యంపై ఎప్పటి కప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ వెంకట్రాం, సీడీపీవో శాంతిశ్రీ ఉన్నారు.