Share News

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసు

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:38 AM

అనుమతులు తేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పెద్దేముల్‌ ఎస్‌ఐ గిరి తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసు

పెద్దేముల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): అనుమతులు తేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పెద్దేముల్‌ ఎస్‌ఐ గిరి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామశివారు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న గోపాల్‌నాయక్‌కు చెందిన ట్రాక్టర్‌, మేఘావత్‌రమే్‌షకు చెందిన ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్లను తహసీల్దార్‌కు వాటిని అప్పగించామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Nov 12 , 2024 | 12:38 AM