కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:50 PM
ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
పరిగి, సెప్టెంబరు 15: ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పరిగి శివారులోని సబ్‌స్టేషన్ దగ్గర జరిగింది. దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన వెంకట్ తనకారులో కుటుంబసభ్యులతో హైదరాబాద్‌కు వెళుతున్నాడు. రంగాపూర్ నుంచి పరిగి వైపు వస్తున్న ఆటో ఢీకొంది. కారులో ఉన్నవారికి ఎలాంటి హానీ కలగలేదు. ఆటోలో ఉన్న ఇద్దరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.