మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో కాషాయ జెండా ఎగరవేయాలి
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:07 AM
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవ ర్గంలో కాషాయ జెం డాను ఎగరవేయాలని జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్, షాద్‌నగర్ నియోజకవర్గ ప్రభారి కొత్తకాపు రవీందర్‌రెడ్డి అన్నారు.
షాద్‌నగర్, ఫిబ్రవరి 12: మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవ ర్గంలో కాషాయ జెం డాను ఎగరవేయాలని జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్, షాద్‌నగర్ నియోజకవర్గ ప్రభారి కొత్తకాపు రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లోని ఏబీ కాంప్లెక్స్‌లో కార్యాకర్తల సమావేశానికి ముఖ్య అతిఽథిగా హాజరయ్యరు. ఆయన మాట్లాడుతూ.. రానున్న సార్వతిక్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కార్యకర్తలు కృషిచేస్తే బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల కు తెలియజేయాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, చెంది మహేందర్‌రెడ్డి, నాయకులు వెంకటేష్‌గుప్తా, నరసింహ, శ్రీనివాస్, వంశీకృష్ణ, వెంకటేష్, పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్, రుషికేష్, కొమరబండ శ్రీశైలం, ఎం. మురళి, మధుసూధన్‌గౌడ్, నరహరి తదితరులు పాల్గొన్నారు.