కారు యజమానిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:43 PM
కారు ప్రమాదంలో మరణించిన చరణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కొత్తపల్లి గ్రామస్తులతో పాటు మృతుడి బంధువులు తక్కళ్లపల్లి గేటు వద్ద సాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
యాచారం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కారు ప్రమాదంలో మరణించిన చరణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కొత్తపల్లి గ్రామస్తులతో పాటు మృతుడి బంధువులు తక్కళ్లపల్లి గేటు వద్ద సాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. శనివారం తమ్మలోనిగూడ వద్ద బైక్‌ను కారు ఢీకొట్టడంతో కొత్తపల్లికి చెందిన చరణ్ మరణించగా చింతపట్లకు చెందిన రవి తీవ్రంగా గాయపడ్డ సంగతి విధితమే. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, మృతుడి బంధువులు ధర్నా చేశారు. సీఐ నర్సింహరావు సంఘటనా ప్రదేశానికి చేరుకొని న్యాయం తెలిపారు.