Share News

నిందితుడికి ఏడాది జైలు

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:38 PM

నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడైనందుకు బైకి్‌స్టకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి శుక్రవారం తీర్పు వెలువరించారు. త

నిందితుడికి ఏడాది జైలు

యాచారం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడైనందుకు బైకి్‌స్టకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి శుక్రవారం తీర్పు వెలువరించారు. తక్కళ్లపల్లి తండాకు చెందిన గాగి(50) ఆమె భర్త హనుమ(57) దంపతులు. 2019 జూన్‌ 11న వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌-నాగార్జున సాగర్‌ ప్రధాన రహదారి వెంట నడచుకుంటూ ఇంటికి వస్తున్నారు. ఒంగోలుకు చెందిన సొరగాయల శ్రీను తన మిత్రుడైన లక్ష్మీనారాయణ వద్ద బైక్‌ తీసుకున్నాడు. దానిపై మాల్‌ వైపు నుంచి యాచారం వైపు అతివేగంగా వస్తున్నాడు. ఈక్రమంలో తక్కళ్లపల్లి తండా వద్ద గాగి, హనుమలను బైక్‌తో ఢీకొట్టాడు. దాంతో హనుమ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గాగి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు వివరాలను కోర్టుకు సమర్పించారు. పాదచారుడి మరణానికి కారకుడైన శ్రీను(41)కు ఏడాది కారాగార శిక్షతో పాటు రూ. 2వేల జరిమానా, లైసెన్స్‌లేని వ్యక్తికి బైక్‌ ఇచ్చినందుకు గాను బైక్‌ యజమాని లక్ష్మీనారాయణకు రూ.వెయ్యి జరిమానా విధించారు.

Updated Date - Nov 29 , 2024 | 11:38 PM