ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:57 PM
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
యాచారం, అక్టోబరు 1: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని నల్లవెల్లితండాకు చెందిన భాస్కర్ కొం త కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తన సమస్యలు తీరవని ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్నామని ఏఎస్సై శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.
ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం
ఆదిభట్ల:సెల్‌ఫోన్ విషయంలో అన్నతమ్ములు గొడవపడి తమ్ముడు ఉరేసుకున్న ఘటన మం గళవారం రావిరాలలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేష్‌కు చెందిన రాకే ష్, ప్రవీణ్‌కుమార్ సోదరులు. మహేశ్వరం మండలం రావిరాల వద్ద కొంగరకుర్ధులోగల సుబ్బరాజు సెంట్రింగ్ యార్డులో పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం సోదరులు సెల్‌ఫోన్ గొడవపడ్డారు. అన్న రాకేష్ మరో చోట కు పనికివెళ్లాడు. ప్రవీణ్‌కుమార్(22) సెంట్రింగ్ యార్డ్ పక్కనున్న మామిడి తోటలో ఉరేసుకున్నట్టు యార్డ్ యాజమాని రాకేష్‌కు చెప్పాడు. రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.