భార్యతో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:33 AM
భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మేడ్చల్ టౌన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన కుమార్(34) ఆదివారం రాత్రి తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో భార్య తన పిల్లలతో కలిసి ఆరుబయట పడుకుంది. సోమవారం ఉదయం లేచి ఇంట్లోచూడగా కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
ఉరేసుకుని యువకుడు..
ఘట్‌కేసర్ రూరల్: మనస్తాపానికి గురై ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ పరుశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఘట్‌కేసర్ పరిధి బాలాజీనగర్‌కు చెందిన కానుకుర్తి సుభాష్(24) కొండాపూర్‌లోని ఓట్యాబ్లెట్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం పనిఉందని కుటుంబసభ్యులకు చెప్పి ఇంటి వద్దే ఉన్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ‘నా చావుకు ఎవరు కారణం కాదు, డబ్బులు ఖర్చుచేయకు. అమ్మా.. జాగ్రత్తగా ఉండు.’ అంటూ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.