Share News

‘సమగ్ర సర్వే’ను పక్కాగా చేపట్టాలి

ABN , Publish Date - Oct 30 , 2024 | 11:27 PM

సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా చేపట్టాలని కేశంపేట ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని అల్వాల రైతువేదికలో బుధవారం ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు బ్యాచ్‌లు విభజించి శిక్షణ ఇచ్చారు.

‘సమగ్ర సర్వే’ను పక్కాగా చేపట్టాలి

కేశంపేట/ఆమనగల్లు/చౌదరిగూడ/షాద్‌నగర్‌ అర్బన్‌/షాబాద్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా చేపట్టాలని కేశంపేట ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని అల్వాల రైతువేదికలో బుధవారం ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు బ్యాచ్‌లు విభజించి శిక్షణ ఇచ్చారు. కులగణన సర్వేను సమగ్రంగా చేపట్టాలని ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ వసంత కోరారు. పట్టణంలోని రైతువేదికలో సర్వే నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో కుసుమ మాధురి అధ్యక్షతన ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్‌ లలిత, తదితరులున్నారు. కుల గణనను ఎన్యుమరేటర్లు, అధికారులు బాధ్యతగా నిర్వహించాలని జిల్లేడ్‌ చౌదరిగూడ మండల ప్రత్యేకాధికారి వెంక్యానాయక్‌ సూచించారు. కొందుర్గు, జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రాల్లో సమగ్ర సర్వే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కులగణన సర్వేను సమగ్రంగా నిర్వహించాలని షాద్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న సూచించారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ ఆఫీసులో కుల సర్వేపై ఎన్యూమరేటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. షాబాద్‌ ఎంపీడీవో అపర్ణ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివా్‌సలు.. ఎంపీడీవో సమావేశం మందిరం, రైతువేదికలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

Updated Date - Oct 30 , 2024 | 11:27 PM