పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:45 PM
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పూడూరు, అక్టోబరు 1: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్‌గోముల్ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో గత నెలలో జరిగిన నిమజ్జన ఉత్సవాల్లో విధుల్లో ఉన్న పోలీసుల పట్ల కొంతమంది అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దూషించారు. ఈ మేరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ చెన్‌గోముల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. పూడూరుకు చెందిన సుజాత, మల్లెగట్ల మల్లేశం, ఎర్ర శ్రీనివాస్, గొర్రెంక అనిల్, ఈడిగి నర్సింహులు, చాకలి పాండు, పిచ్చకుంట్ల శ్రీశైలం, మడిముల జంగయ్య, ప్యాట శేఖర్‌లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని దోమ మండల పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వికారాబాద్ జూడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపారు.