Share News

పురుగు మందులు మోతాదులో వాడాలి

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:15 AM

పంటల్లో చీడపీడల నివారణకు నిర్ణీత మోతాదులో క్రిమిసంహారక మందులు వాడాలని మండల వ్యవసా య అధికారి బి. పురుషోత్తం రైతులకు సూచించారు.

పురుగు మందులు మోతాదులో వాడాలి
కేతేపల్లిలో మాట్లాడుతున్న వ్యవసాయాధికారి పురుషోత్తం

కేతేపల్లి, అక్టోబరు 1: పంటల్లో చీడపీడల నివారణకు నిర్ణీత మోతాదులో క్రిమిసంహారక మందులు వాడాలని మండల వ్యవసా య అధికారి బి. పురుషోత్తం రైతులకు సూచించారు. కేతేపల్లిలోని రైతు వేదికలో మంగళవారం రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో రైతు లతో మాట్లాడారు. పురుగు మందుల కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంటలపై నిర్ణీత మోతాదుకు మించి పురుగు మందులు వాడితే మందు వృథా కావడంతో పాటు ఆయా మందుల అవశేషాలు పంటలపై మిగిలి పంట నాణ్యత తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో బాలరాజు, నాగరాజు, ఉమేష్‌ పాల్గొన్నారు.

మాడ్గులపల్లి: రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్‌ ఫ్రూట్‌, శ్రీగంధం సాగు చేసి అధిక లాభాలు గడించవచ్చని డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీసెస్‌ ఫర్‌ అగ్రి ఇన్‌పుట్స్‌ డీలర్స్‌ ఫెసి లిటేటర్‌ టి. కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఆయన మండలం లోని చంద్ర వ్యవసాయ క్షేత్రంలో డిప్లొమా కోర్సు డీలర్లకు, రైతులకు అవగాహన కల్పించారు. చంద్ర వ్యవసాయ క్షేత్రంలో తండు సైదు లు సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్స్‌, శ్రీగంధం, మామిడి, బత్తాయి తోటల వివరాలను వారికి వివరించి సాగుపై అవగాహన కల్పిం చారు. ఈ పంటలసాగు వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:15 AM