Share News

Manchiryāla- అధికారులే సూత్రధారులు

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:06 PM

మరణించిన వారి సంతకా లు ఫోర్జరీ చేసి భూమిని విరాసత్‌ చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన ఘటనలో అసలు సూత్రధారులు రెవెన్యూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులేనని తేలింది. ‘ఆంధ్రజ్యోతి’ ఆధారాలతో సహా అక్రమాలను బయట పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు.

Manchiryāla- అధికారులే సూత్రధారులు
ఫోర్జరీ సంతకాలతో విరాసత్‌ కోసం దరఖాస్తు చేసిన భూమి

- పరారీలో మరో ప్రభుత్వ ఉద్యోగి

- భూమి విరాసత్‌లో వారి పాత్రే కీలకం

- ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన డొంక

- విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు తహసీల్దార్‌ ఫిర్యాదు

- ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో జైలు పాలైన ఆర్‌ఐ, సిబ్బంది

మంచిర్యాల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మరణించిన వారి సంతకా లు ఫోర్జరీ చేసి భూమిని విరాసత్‌ చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన ఘటనలో అసలు సూత్రధారులు రెవెన్యూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులేనని తేలింది. ‘ఆంధ్రజ్యోతి’ ఆధారాలతో సహా అక్రమాలను బయట పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. దీంతో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు జైలు ఊచలు లెక్కబెడుతుండగా, మరో ఉద్యోగి పరారీలో ఉన్న సంఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒకే కేసులో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసు కేసు లు నమోదు కావడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

- సంఘటన పూర్వపరాలు..

దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గొర్రె జానీకి 1.18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయనకు ఇద్దరు కుమారులు పౌల్‌, స్వామి ఉన్నారు. జానీ ఆనారోగ్యం కారణంగా 2012లో మరణించగా, అతని భార్య మరియ గత ఏడాది సెప్టెంబరులో చనిపోయింది. కాగా జానీ దం పతుల పెద్ద కుమారుడు పౌల్‌ కూడా 2024 జనవరి 6న అనారోగ్యంతో మరణించాడు. పౌల్‌ భార్య ఏసుమణికి తెలియకుండా తన తండ్రి పేరిట ఉన్న భూమిని రెండో కుమారుడు స్వామి విరాసత్‌ చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. విరాసత్‌ చేసుకొనే క్రమంలో స్వామి 2023 ఏప్రిల్‌ 28న మీ సేవాలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం అప్పటికే చనిపోయిన అతని సోదరుడు పౌలు, తల్లి మరియ సంతకాలను ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ సంతకాలతో కూడిన ఫైలును 14 నెలల తరువాత 2024 జూన్‌లో తహసీల్దార్‌ కార్యాలయానికి పంపించారు. దరఖాస్తు అందిన తరువాత మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం మరణించిన వారి కుటుంబ సభ్యుల సమక్షం లో పంచనామా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సంతకాలు సేకరించిన తరువాత సదరు ఫైలును తహసీల్దార్‌ లాగిన్‌లో పొందు పర్చాలి ఉంటుంది. అయితే దరఖాస్తుపై ఎవరు సంతకం చేశారో నిర్ధారిం చకుండానే ఆర్‌ఐ తహసీల్దార్‌ లాగిన్‌లో నమోదు చేయడం గమనార్హం. ఆర్‌ఐ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మండల తహసీల్దార్‌ సంబంధిత ఫైలును అప్రోవల్‌ కోసం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి పంపిం చారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌ లాగిన్‌కు సైతం వెళ్లింది. సంబంధిత ఫైలు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో అనుమానం వచ్చిన కలెక్టర్‌ కార్యాలయం సిబ్బంది దాన్ని తిరస్కరించారు. ఈ అక్రమ బాగోతంపై ’ఫోర్జరీ సంతకాలతో విరాసత్‌కు యత్నం’ శీర్షికన ఈ నెల 7న ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా అనుబంధంలో కథనం ప్రచురితం కావడంతో విష యం వెలుగులోకి వచ్చింది.

- ఆర్‌ఐ కనుసన్నల్లోనే..

ఫోర్జరీ సంతకాల తతంగమంతా ఆర్‌ఐ చంద్రమౌళి కను సన్నల్లోనే జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆర్‌ఐతోపాటు తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేసే బైరం విజయ్‌కి లక్షెట్టిపేట ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌లో విధులు నిర్వహించే మరో ముగ్గురు ఉద్యోగు లు సహకరించినట్లు తేలింది. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడం తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్‌ సంధ్య విధిలేని పరిస్థి తుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఫోర్జరీ జరిగి నట్లు నిరూపణ కావడంతో నిందితుడు గొర్రె స్వామితోపాటు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదైంది.

- పోలీసుల విచారణలో..

పోలీసుల విచారణలో నిందితులుగా నిరూపణ అయిన గొర్రె స్వామి-ఏ1తోపాటు ప్రభుత్వ ఉద్యోగులైన చంద్రమౌళి (ఆర్‌ఐ)-ఏ2, బైరం విజయ్‌-ఏ3 (ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌), బైరం ప్రభాకర్‌-ఏ4 (ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌), బైరం రమేశ్‌-ఏ5 (ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌), సారంగుల లింగయ్య-ఏ6లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వీరిలో చంద్రమౌళి, బైరం ప్రభాకర్‌, గొర్రె స్వామి, సారంగుల లింగయ్యను పోలీసులు అరెస్టు చే యగా ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. కాగా బైరం విజయ్‌, బైరం రమేశ్‌ పరారీలో ఉన్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

- మరికొందరు కూడా..

ఫోర్జరీ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరుగురిపై ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేయగా, సంబంధం ఉన్న మరి కొందరిపై త్వరలోనే చర్య లు ఉండే అవకాశాలు ఉన్నాయి. కేసును లోతుగా విచారించే కొద్దీ మరి కొందరు తెరపైకి వస్తున్నారని, త్వరలోనే పరారీలో ఉన్న బైరం విజయ్‌, బైరం రమేశ్‌తోపాటు మిగతా వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 11:06 PM