Share News

సాగర్‌లో ఆక్టోపస్‌ దళాల మాక్‌ డ్రిల్‌

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:03 AM

నాగార్జునసాగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రధాన డ్యామ్‌పై శుక్రవారం రాత్రి ఆక్టోపస్‌ దళాలు మాక్‌డ్రిల్‌ నిర్వహించాయి.

   సాగర్‌లో ఆక్టోపస్‌ దళాల మాక్‌ డ్రిల్‌

నాగార్జునసాగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రధాన డ్యామ్‌పై శుక్రవారం రాత్రి ఆక్టోపస్‌ దళాలు మాక్‌డ్రిల్‌ నిర్వహించాయి. ప్రధాన డ్యామ్‌పై ఉగ్రవాదుల దాడులు జరి గితే ఎలా ఎదుర్కోవాలో సాయంత్రం 4నుంచి రాత్రి 7 గంటల వరకు ఫైరింగ్‌ చేసి సిబ్బందికి చూపించారు. ప్రధాన డ్యామ్‌ రేడియల్‌ క్రస్ట్‌ గేట్లపై నుంచి ఎదురుగా వస్తున్న ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలో చూపారు. డ్యామ్‌ అంతర్భాగంలో ఉన్న గ్యాలరీల వద్ద, ప్రధాన జల వి ద్యుత్‌ కేంద్రంలో, ప్రధాన డ్యాంపై, జలాశయంలో నీటిమార్గంలో ఉగ్ర వాదులు వచ్చి దాడి చేస్తే ఎలా మట్టుబెట్టాలో వివరించారు. డ్యామ్‌పై మాటువేసిన ఉగ్రవాదులను ఎలా అంతమొందించాలో, ఉగ్రవాదులు డ్యామ్‌పై ఎక్కడెక్కడ దాక్కునే అవకాశం ఉందో అక్టోపస్‌ దళాలు డ్యాంపై ఉన్న భద్రత సిబ్బందికి మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

Updated Date - Nov 30 , 2024 | 12:03 AM