కోఠి కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:18 AM
కోఠి మ హిళా కళాశాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చి ట్యాల ఐలమ్మ పేరు పె ట్టడంతో పాటు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వే తకు మహిళా కమిషన సభ్యురాలిగా నియమిస్తానని ప్రకటించడంపై రజక సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది.
కోఠి కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయం
నల్లగొండటౌన, సె ప్టెంబరు 15: కోఠి మ హిళా కళాశాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చి ట్యాల ఐలమ్మ పేరు పె ట్టడంతో పాటు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వే తకు మహిళా కమిషన సభ్యురాలిగా నియమిస్తానని ప్రకటించడంపై రజక సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మే రకు సీఎం రేవంతరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రజక సంక్షేమ సంఘం, రజక భవన సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం క్లాక్‌టవర్‌లోని పూలే విగ్రహం వద్ద సీఎం రేవంతరెడ్డితో పాటు మంత్రి వెంకట్ రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రజక భవన అధ్యక్షుడు ఆ మంచి అంజయ్య, టీఎన్జీవోస్ అధ్యక్షుడు నాగిళ్ల మురళి, రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కుల రాములు మాట్లాడుతూ రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థల్లో దోబీ పోస్టులను రజకులకే ఇవ్వాలని కోరా రు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరా రు. కార్యక్రమంలో రజక ఉద్యోగుల సంఘం నాయకుడు అక్కెనపల్లి లక్ష్మయ్య, ర జక సంక్షేమ సంఘం నాయకులు చిలక రాజు వెంకన్న, చిలకరాజు యాదగిరి, సట్టు యాదగిరి, కనకయ్య, ఎలిజాల సత్తయ్య, నలపరాజు సైదులు, దుర్గయ్య, చిక్కుల శంకర్, వేణు, శ్రీనివాస్, సత్తయ్య, శంకర్ పాల్గొన్నారు.