Share News

‘వైటీపీఎస్‌’ కాపర్‌ దొంగల అరెస్ట్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:08 AM

మండల పరిధిలో ని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎ్‌స)లో నాలుగేళ్లుగా కాపర్‌ వస్తువులను చోరీ చేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.26లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వెల్లడించారు.

‘వైటీపీఎస్‌’ కాపర్‌ దొంగల అరెస్ట్‌
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

రూ.26లక్షల నగదు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

మిర్యాలగూడ, సెప్టెంబరు 11: మండల పరిధిలో ని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎ్‌స)లో నాలుగేళ్లుగా కాపర్‌ వస్తువులను చోరీ చేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.26లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వెల్లడించారు. బుధవారం ఉదయం మిర్యాలగూడ ఈదులగూడెంలో పాతఇనుము విక్రయించే వ్యాపారి పగడాల బాలరాజు దుకాణం వద్ద సాత్‌తండాకు చెందిన వ్యవసాయ కూలీ లు గుగులోతు రఘు, గుగులోతు రాముడు, దుబ్బతండాకు చెందిన కొర్ర శివ, తాళ్ల వీరప్పగూడెం కిరాణ వ్యాపారి చెన్నబోయిన నాగయ్య, మిర్యాలగూడకు చెందిన పాతఇనుము వ్యాపారులు బత్తుల జానకిరాములు, పగడాల బాలరాజు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఆధ్వర్యంలో టూటౌన్‌, రూరల్‌ సీఐల నేతృత్వంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వైటీపీఎ్‌సలో కాపర్‌ వస్తువులను దొంగిలించి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వైటీపీఎస్‌ పరిసర గ్రా మాలైన తాళ్లవీరప్పగూడెం, సాత్‌తండా, దుబ్బతండా, వీర్లపా లెం గ్రామాలకు చెందిన వ్యక్తులు పవర్‌స్టేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించి వైటీపీఎస్‌ నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ స్టోర్‌ యార్డ్‌లో అన్‌లోడ్‌ చేసిన కాపర్‌ వస్తువులు సెక్యూరిటీ లేని సమయం చూసి దొంగిలించి తాళ్లవీర్పగూడెం బెల్ట్‌షాప్‌ నిర్వాహకులు పెండెం భాస్కర్‌ ఇంట్లో దాచి ఉంచుతున్నట్లు తె లిపారు. భాస్కర్‌ మిర్యాలగూడ పట్టణానికి చెందిన పాతఇను ము వ్యాపారులు మేకల శ్రీను, పగడాల బాలరాజుతో కలిసి వా టిని హైదరాబాద్‌కు తరలించి పలు దుకాణాల్లో విక్రయిస్తున్న ట్లు తెలిసిందన్నారు. దీంతో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ.26లక్షల నగదు, ఆటో, రెండు ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో మేకల శ్రీనుపై దామరచర్ల, మిర్యాలగూడలో పలు కేసులు న మోదయ్యాయని, హిస్టరీషీట్‌ ఓపెన్‌ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపా రు. నేరస్తులను గుర్తించి పట్టుకున్న టూటౌన్‌ సీఐ నాగార్జున, రూరల్‌ సీఐ వీరబాబు, సీసీఎస్‌ సీఐ జితేందర్‌రెడ్డి, వాడపల్లి ఎస్‌ఐ, టూటౌన్‌ ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖరరాజు, పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:08 AM