వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:26 AM
రాష్ట్రంలో వరదలతో నష్టపోయి న కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
హుజూర్‌నగర్, సెప్టెంబరు 4 : రాష్ట్రంలో వరదలతో నష్టపోయి న కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో ప్రజలు తీవ్రం గా నష్టపోయారన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10వేలు, ఇల్లు పూర్తిగా కోల్పోతే ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం పేదలకు అండ గా ఉంటుందన్నారు. చెరువులు, కుంటలకు పడిన గండ్లు వెంటనే పూ డ్చాలని అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చి రైతాంగానికి అండగా ఉండాలన్నారు. భారీ వరదలతో నష్టం వాటిల్లిందన్నారు. వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టంపై వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే చేయాలన్నారు. ఇల్లు కూలిపోయిన బాధితులకు పరిహారం చెల్లించాలన్నారు. మునిసిపల్, రెవెన్యూ, మం డల పరిషత్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కాల్వ కట్టలు, నాలాలపై అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించారు. కాగా పట్టణంలోని బైపా్‌సరోడ్డు, తిలక్‌నగర్, 14వ వార్డు ప్రాంతాల్లోని పలుసమస్యలను కాంగ్రెస్ నాయకుడు యోహాన్ మంత్రికి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ గూడె పు శ్రీనివాసు, ఎండీ నిజాముద్దీన్, ముడెం గోపిరెడ్డి, చలమల రాఘవయ్య, కోలపూడి యోహన, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.