వరంగల్ డిక్లరేషనను అమలు చేయాలి: బీకేఎస్
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:34 AM
వరంగల్ డిక్లరేషనను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారతీయ కిసాన సంఘ్ (బీకేఎస్) దక్షణ క్షేత్ర సంఘటనా కార్యదర్శి రాము, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్యాల వెంకట్‌రెడ్డి అన్నారు.
భువనగిరి టౌన, అక్టోబరు 1: వరంగల్ డిక్లరేషనను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారతీయ కిసాన సంఘ్ (బీకేఎస్) దక్షణ క్షేత్ర సంఘటనా కార్యదర్శి రాము, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్యాల వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలో జరిగిన బీకెఎస్ జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. అసైన్డ భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా బీకెఎస్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదునేని రవీందర్ పాల్గొన్నారు. అధ్యక్షుడిగా పోకల యాదగిరి, ఉపాధ్యక్షుడిగా వంచ వీరారెడ్డి జంగిటి కైలాసం, కార్యదర్శిగా కాలం ఐలే్‌షకుమార్, సహాయ కార్యదర్శులుగా తునికి నరేందర్, పిట్టల జయరాములు, కోశాధికారిగా వంగేటి అంజిరెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.