తండ్రి చేతిలో కుమారుడి హతం
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:17 AM
మద్యానికి బానిసై తరుచూ వేధిస్తున్న కుమారుడిని తండ్రి హతమార్చాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం కొత్తతండా పరిధిలోని బాపూజీతండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
సూర్యాపేట, సెప్టెంబరు 11 : మద్యానికి బానిసై తరుచూ వేధిస్తున్న కుమారుడిని తండ్రి హతమార్చాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం కొత్తతండా పరిధిలోని బాపూజీతండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మద్యానికి బానిసై డబ్బుల కోసం వేధిస్తున్న కుమారుడు బానోత కిరణ్(37)ని అతడి తండ్రి పంతులు గొడ్డలితో దాడి చేసి హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. కిరణ్ తన తండ్రిని తరుచూ డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తూ ఉండేవాడని, బుధవారం సాయంత్రం భార్య బంధువుల ఇంటికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి పంతులుతో కిరణ్ మద్యంమత్తులో గొడవపడినట్లు స్థానికులు తెలిపారు. విసిగివేసారిన తండ్రి పంతులు పక్కన ఉన్న గొడ్డలితో కిరణ్‌పై దాడి చేయడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సైదులు, సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి క్లూస్‌టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పంతులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిరణ్‌కు భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా పంతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తుండగా, కిరణ్ మద్యానికి బానిసై ఏపనీ చేయడం లేదు. ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.