Share News

సీసీరోడ్డు బురదమయం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:02 AM

సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించడంతో ప్రజలకు పరేషాన మిగిలింది.

సీసీరోడ్డు బురదమయం
దత్తాయపల్లి ప్రధాన కూడలిలో వేసిన సీసీ రోడ్డుపై నిలిచిన నీరు

అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణం

ఇబ్బందిపడుతున్న ప్రజలు

తుర్కపల్లి, సెప్టెంబరు 11: సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించడంతో ప్రజలకు పరేషాన మిగిలింది. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా సీసీ రోడ్లు వేయడం వల్లే తాము తీవ్ర ఇబ్భందులు పడుతున్నట్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో పారిశుధ్య సమస్య అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామంలో మురికి కాలువల నిర్మాణం లేకపోవడంతో ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీరు రోడ్లపైనే ప్రవహిస్తుండడంతో గ్రామాస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ ఎదుట ఉన్న రోడ్డుపైనే మురికి నీరు పారుతుండడంతో కాలనీ వాసులు కాలి నడకన వెళ్లలేక పోతున్నారు. గ్రామంలోని పాత పంచాయతీ (గ్రామ ప్రధాన చౌరస్తా) ముందు వేసిన సీసీ రోడ్డు, యాదవ కమ్యూనిటీ హాల్‌ వెళ్లే రోడ్డు సీసీ వేయక ముందు రాక పోకలు సాగించడానికి బాగుండేవని, ఇక్కడ సీసీ రోడ్లు వేసిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేయడంతో ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీటితో పాటు ఇటీవల కురిసిన వర్షం నీరంతా ఒక దగ్గర నిలిచి పోవడంతో రాకపోకలు సాగించడానికి గ్రామ స్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వేసేటప్పుడు సమతలంగా(సమాతరంగా) రోడ్డుకు రెండు వైపుల ఎత్తుగా వేసి మధ్యలో రోడ్డు వంపుగా ఉండడంతో నీరంతా మద్యలో నిలిపోతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. రోడ్డు పక్క నుంచి మురికి కాల్వల నిర్మాణం లేక పోవడంతో పారిశుధ్య సమస్య ఏర్పడిం ది. మురికి గుంతల్లో నీటి నిలువ కారణంగా ఈగలు, దోమలు విజృంభించి, విష జ్వరాల బారిన పడే ప్ర మాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న మురికి గుంతల్లో మట్టి పో సి పారిశుఽధ్య నివారణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు గ్రామస్థులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మట్టి రోడ్డే బాగుండేది

సీసీ రోడ్డు వేయక ముందు ఉన్న మట్టి రోడ్డే బాగుండేది. సీసీ రోడ్డుపై నిలిచిన మురికి నీరు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అంతే కాకుండా ఈ రోడ్డు బురదగా ఉండడంతో కాలి నడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సీసీ రోడ్డుపైన మట్టి పోసి ఇబ్బందులు తొలగించాలి.

-గాదె మల్లేశ, గ్రామస్థుడు, దత్తాయపల్లి

కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

గ్రామంలో అంతర్గత మురికి కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. గ్రామంలో గతంలో వేసిన మురికి కాలువలు పూర్తిగా శిఽథిలమయ్యాయి. దీంతో గ్రామంలో పారిశుధ్య సమస్య నెలకొంది. సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాల్వల నిర్మాణం చేపట్టి, గ్రామంలో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలి.

-గిద్దె కరుణాకర్‌, మాజీ ఎంపీటీసీ, దత్తాయపల్లి

Updated Date - Sep 12 , 2024 | 12:03 AM