కోదాడకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:12 AM
కోదాడలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో నెం.731 విడుదల చేసింది. ఈ సెంటర్ నిర్మాణానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ రూ.10కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ ఈ కేంద్రాన్ని కోదాడలో ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక, ఆటో మొబైల్ రంగానికి కేంద్రమైన కోదాడలో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించి కోదాడకు ఈ సెంటర్ దక్కింది.
జీవో నెం.731 ద్వారా రూ.10కోట్లు మంజూరు
ఫలించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి కృషి
వీలైనంత వేగంగా అందుబాటులోకి తెస్తాం : మంత్రి
నల్లగొండ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/కోదాడ: కోదాడలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో నెం.731 విడుదల చేసింది. ఈ సెంటర్ నిర్మాణానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ రూ.10కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ ఈ కేంద్రాన్ని కోదాడలో ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక, ఆటో మొబైల్ రంగానికి కేంద్రమైన కోదాడలో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించి కోదాడకు ఈ సెంటర్ దక్కింది. ఈ కేంద్రం ఏర్పాటయితే ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతోపాటు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్లకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నైపుణ్య సాధనతో జాబ్ గ్యారంటీతో నిరుద్యోగ యువత కుటుంబాలకు ఊరట కలగడంతోపాటు, అదే సమయంలో సామాజిక వృద్ధికి దోహదపడుతుంది. శాస్త్ర, సాంకేతికంగా వస్తున్న మార్పులను యువత అందిపుచ్చుకునేందుకు ఈ సెంటర్లు దోహదపడతాయన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల్లో నైపుణ్య శిక్షణ పొందడం ద్వారా అకడమిక్ క్వాలిఫికేషన్ ఉన్న యువతకు మరింత మెరుగైన వేతనాలతో ఉద్యోగాలు దక్కుతాయి. అకడమిక్ విద్యలేకపోయినా, 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు డ్రాపవుట్ విద్యార్థులకు సైతం వారికి తగిన వృత్తుల్లో ఇక్కడ శిక్షణ లభిస్తుంది. తద్వారా వారి జీవనోపాధికి మెరుగైన అవకాశాలు దక్కుతాయి. 1998లో స్థాపించబడిన ఎన్‌ఏసీ (నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్) ఇప్పటివరకు దేశంలో దాదాపు 5లక్షల మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణను అందించిందని, అందరికీ తగిన ఉపాధి అవకాశాలు దక్కాయని సంస్థ రికార్డుల్లో పేర్కొంది. అలాంటి సంస్థ కోదాడలో రూ.10కోట్లతో స్కిల్‌డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం ఇక్కడి నిరుద్యోగ యువతకు ఒక చక్కటి అవకాశమని, వీలైనంత వేగంగా ఇక్కడ ఈ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పేర్కొన్నారు.