Share News

పొంచిఉన్న ప్రమాదం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:05 AM

మండల కేంద్రంలోని సెయింట్‌ పీటర్‌ పాఠశాలకు వెళ్లే మార్గంలో ఇనుపస్తంభం శిథిలావస్థలో ఉంది.

పొంచిఉన్న ప్రమాదం
ఇనుప స్తంభం.. పక్కనే నిరుపయోగంగా ఉన్న నూతన స్తంభం

శిథిలావస్థలో ఇనుప స్తంభం

మోటకొండూరు, సెప్టెంబరు 11: మండల కేంద్రంలోని సెయింట్‌ పీటర్‌ పాఠశాలకు వెళ్లే మార్గంలో ఇనుపస్తంభం శిథిలావస్థలో ఉంది. గ్రోమోర్‌ సెంటర్‌ వద్ద ఉన్న స్తంభం నుంచి సెయింట్‌ పీటర్‌ పాఠశాలకు వెళ్లే మార్గంలో ఉన్న బీఎ్‌సఎనఎల్‌ ఇనుప స్తంభానికి బాంచిల్‌ కేబుల్‌ వేసి వీధిలైటు అమర్చి వదిలేశారు. నిత్యం స్కూల్‌ విద్యార్థులు అదే దారిన వస్తూ, పోతుంటారు. వర్షకాలం కావడంతో ఈదురుగాలులు, వర్షాలకు వైర్లు తేలి ఇనుప స్తంభానికి తగిలితే విద్యుదాఘా తంతో ఊహించని నష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్తంభం పక్కనే విద్యుత అధికారులు నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి వదిలేయడంతో అది నిరుపయోగంగా ఉంది. విద్యుత ఆధికారులు స్పందించి ఇనుప స్తంభం నుంచి విద్యుత కనెక్షన తొలగించి, నూతనంగా ఏర్పాటు చేసిన స్తంభానికి కనెక్షన ఇవ్వాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కాగా విద్యుత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మండల కేంద్రంలో రోజుల తరబడి పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. కొన్ని కాలనీల్లో రాత్రి సమయాల్లో వెలగాల్సిన వీధి దీపాలు వెలుగకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 08:31 AM