Share News

రాష్ట్రం ఎదగాలంటే బీజేపీ రావాలి

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:14 AM

తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఎదగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని మల్కాగ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

రాష్ట్రం ఎదగాలంటే బీజేపీ రావాలి
గిరిజన మహిళకు సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేస్తున్న ఎంపీ ఈటల రాజేందర్‌

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌

రామగిరి, సెప్టెంబరు 11 : తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఎదగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని మల్కాగ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. అవినీతి, కుటుంబపాలన లేని పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పాలన మాత్రమేనని అన్నారు. దేశం అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని తీసుకొని దేశ భవిష్యతకు నాంది పలకాలన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పని చేసే పార్టీ కూడా బీజేపీనే అని అన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి అధ్యక్షుడి మార్పు ఉన్న పార్టీ కూడా బీజేపీ అన్నారు. ప్రతీ బూతలో సభ్యత్వ నమోదును విరివిగా చేసి రాష్ట్రంలోనే జిల్లాను ముందుంచాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. ప్రజలకు బీజేపీ మీద విశ్వసం ఉంది కాబట్టే నరేంద్రమోదీని మూడోసారి కూడా గెలిపించుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షితరెడ్డి, రాష్ట్ర నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్‌, మాదగాని శ్రీనివా్‌సగౌడ్‌, బండారు ప్రసాద్‌, పిల్లి రామరాజుయాదవ్‌, గోలి మధుసూదనరెడ్డి, పోతేపాక సాంబయ్య తదితరులు ఉన్నారు.

ఒకటో నెంబర్‌ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు

నల్లగొండలోని పాతబస్తీలో ఏర్పాటుచేసిన ఒకటో నెంబర్‌, 19వవార్డులో ఏర్పాటు చేసిన వినాయకులను ఈటల దర్శించుకొని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:15 AM