Share News

బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే ఉద్యమం ఉధృతం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:13 AM

పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచాలని, లేకుంటే ఉద్యమ ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య హెచ్చరించారు.

 బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే ఉద్యమం ఉధృతం
సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య

నల్లగొండ రూరల్‌, సెప్టెంబరు 10 : పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచాలని, లేకుంటే ఉద్యమ ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య హెచ్చరించారు. బీపీ మండల్‌ 106 జయంతిని పురష్కరించుకొని బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోర్డు ఎదురుగా బీపీ మండల్‌ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకు హామీని నిలబెట్టుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబరు నెలాఖరు వరకు జరుపుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం ముందుగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో కులగణన చేసి, రిజర్వేషన్లు పెంచాలన్నారు. అందుకోసం మూడు నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం, అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇక రాహుల్‌గాంధీ అయినా స్పందించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతారా లేదా ప్రకటన చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు అందుకు విరుద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీ నేతలు జెండాలు మోసుకుంటు, జిందాబాద్‌లు, బానిసలుగా మారారని, ఇకనైనా ఆ బతుకులకు స్వస్తి చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి కోసం చేసే పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ సవరణ చేయాలి సుప్రీంకోర్టు ప్రకారం తీర్పు ప్రకారం 50శాతం సీలింగ్‌ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలులేదన్నారు. ఇప్పటికే అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు పెట్టి 50శాతం సీలింగ్‌పై పార్లమెంట్‌ రాజ్యాంగ సవరణ చేసిందన్నారు. ఆ అగ్రకులాలకు రిజర్వేషన్లను పెంచడానికి మూడు రోజుల్లో లోక్‌సభ, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు కానీ 50 శాతం జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా ఇదేం న్యాయమని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌ పార్టీ తన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజారాంయాదవ్‌, సంఘం జిల్లా అధ్యక్షుడు దూకుడుకు లక్ష్మీ నారాయణ, నీల వెంకటేశం, పిల్లి రామరాజు, వంగూరి నారాయణయాదవ్‌, ప్రసన్న, శిరందాసు రామదాసు, సత్తయ్య, సర్పాల వెంకన్న, అల్లి వేణు, మామిడి పద్మ, సింగం లక్ష్మీ, కొండూరు సత్యనారాయణ, గోవార్దన, గద్దె నాగరాజు, సతీష్‌ యాదవ్‌, వల్లేకీర్తీ శ్రీనివాస్‌, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:13 AM