పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:18 AM
పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ హనుమంతు కే.జెండ గే అన్నారు. ‘మట్టి గణపతులనే పూజిద్దాం’ సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు.
కలెక్టర్ హనుమంతు కే. జెండగే
భువనగిరి అర్బన్, సెప్టెంబరు 4: పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ హనుమంతు కే.జెండ గే అన్నారు. ‘మట్టి గణపతులనే పూజిద్దాం’ సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది అడుగుల మట్టి గణపతులను అందించి పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ మండలి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే.గంగాధర్, డీఆర్డీవో టి. నాగిరెడ్డి, ఇంజనీర్ డాక్టర్ సంగీత, అసిస్టెంట్ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.రామకృష్ణ, డీపీవో ఆర్.సునంద, బీసీ కులాల అభివృద్ధి అధికారి పి.యాదయ్య, డీపీఆర్వో పి.వెంకటేశ్వరరావు, పశు సంవర్ధక అధికారి డాక్టర్ కృష్ణ, భువనగిరి మునిసిపల్ కమిషనర్ రామాంజులురెడ్డి, కలెక్టరేట్ ఏవో జగన్మోహన్‌ప్రసాద్ పాల్గొన్నారు.
సకాలంలో పనులు పూర్తి చేయాలి
భువనగిరి టౌన్: భువనగిరిలో నిర్మిస్తున్న అంబేడ్కర్ భవన పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి ఆయన అం బేడ్కర్ భవనాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. రెండు అంతస్థులుగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించి పెండింగ్ పనుల పై సంబంధిత అధికారులతో అక్కడే సమీక్షించారు. ప్రత్యేక ట్రా న్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని, పక్కనే ఉన్న గిరిజన బాలికల కళాశాల హాస్టల్‌తో కలిపి డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలన్నారు. కిటికీలు,తలుపులు, విద్యుత్ తదితర పనులతోపాటు సుందరీకర ణ పనులను పూర్తిచేసి నెలాఖరున ప్రారంభోత్సవానికి సిద్ధం చే యాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈలు గిరిధర్, సుదర్శన్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ పి.రామాంజుల్ రెడ్డి, ఏఈ ప్రసాద్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగారం అంజయ్య, మునిసిపల్ మాజీ చైర్మన్ జహంగీర్, కౌన్సిలర్లు ఈరపాక నర్సింహ, పడిగల రేణుకాప్రదీప్ పాల్గొన్నారు.