ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:19 AM
వాహనదారులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. బుదవారం జాతీయ రహదారి 65పై టేకుమట్ల వద్ద ఖమ్మం హైవే జంక్షన్, రాయినిగూడెం ఖమ్మం యూటర్న్ జంక్షన్‌ను ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్
సూర్యాపేటరూరల్, సెప్టెంబరు 11: వాహనదారులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. బుదవారం జాతీయ రహదారి 65పై టేకుమట్ల వద్ద ఖమ్మం హైవే జంక్షన్, రాయినిగూడెం ఖమ్మం యూటర్న్ జంక్షన్‌ను ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్‌స్పాట్ వద్ద రోడ్డు స్థితిగతులు, లోపాలను పరిశీలించి తగిచన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కారణాలపై చర్చించి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాణం చాలా విలువైనదని, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోకుండా చూడాలన్నారు. వాహనదారులు రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపరాదన్నారు. జాతీయ రహదారుల సంస్థ, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు రహదారి లోపాల సవరణపై దృష్టి పెట్టాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రవి, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ బాలునాయక్, తదితరులు ఉన్నారు.