Share News

సాయుధ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:19 AM

సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సీపీఐ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు గోదా శ్రీరాములు, నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు.

సాయుధ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
చౌటుప్పల్‌: మసీదుగూడెంలో సాయిరెడ్డి స్మారక స్తూపం వద్ద నివాళులు ఆర్పిస్తున్న శ్రీరాములు, సత్యం

చౌటుప్పల్‌ రూరల్‌, సెప్టెంబరు 15: సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సీపీఐ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు గోదా శ్రీరాములు, నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మండల పరిధిలోని మసీదుగూడెంలో వాకిటి సాయిరెడ్డి స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధపోరాట తొలితరం నాయకుడు వాకిటి సాయిరెడ్డి అని అన్నారు. సాయిరెడ్డి దళంలో ప్రత్యక్షంగా పనిచేసి భూస్వాములకు వ్యతిరేకంగా భూమి, భుక్తి విముక్తి కోసం పోరాటాలు నిర్వహించాడని కొనియాడారు. సాయిరెడ్డి అనేక సార్లు జైలు జీవితం గడిపాడన్నారు. సాయిరెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుద వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్‌రెడ్డి, దుబ్బాక బాస్కర్‌, కలకొండ సంజీవ, పగిళ్ల మోహనరెడ్డి, పిల్లి శంకర్‌, కొండూర్‌ విప్లవ్‌, బద్దుల సుధాకర్‌, మర్రి రాంరెడ్డి, వాకిటి అమర్‌నాథ్‌రెడ్డి, ఉడుత రామలింగం పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:19 AM