అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:23 AM
‘ప్రజావాణి’ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిచందన అన్నారు. ‘ప్రజావాణి’లో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను తీసుకున్నారు.
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 12 : ‘ప్రజావాణి’ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిచందన అన్నారు. ‘ప్రజావాణి’లో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను తీసుకున్నారు. అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటి దరఖాస్తులు అప్పుడే పరిష్కరించాలన్నారు. ఒకసారి వచ్చిన దరఖాస్తు మళ్లీ రాకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కాగా, సోమవారం ‘ప్రజావాణి’లో మొత్తం 50మంది అర్జీలు అందజేశారు.