Share News

డిజిటల్‌ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:35 AM

ఈ నెల 3నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.

డిజిటల్‌ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలి

కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన మంత్రి పొంగులేటి, సీఎస్‌ శాంతికుమారి

భువనగిరి (కలెక్టరే ట్‌), అక్టోబరు 1: ఈ నెల 3నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ఫ్యామి లీ డిజిటల్‌ కార్డుల సర్వే నగరాలు, పట్టణ ప్రాంతాల విస్తరణకై ప్రతిపాదనలు, భూముల క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిష్కారం, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుకోసం లబ్ధిదారుల ఎంపిక, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి, సీఎస్‌ శాంతి కుమారి సమీక్షించారు. డిజిటల్‌ కార్డుల జారీకి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెండు గ్రామాల్లో ప్రయోగాత్మక సర్వేను నిర్వహించాలన్నారు. అర్బన్‌ నియోజకవర్గాలయితే రెండు వార్డులు, లేదా డివిజన్లు ఎంపిక చేయాలని సూచించారు. ఇంటింటి పరిశీలన చేపట్టి ప్రతీ కుటుంబానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించి ఈ నెల 8వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. భూముల క్రమబద్దీకరణ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సన్నరకం, దొడ్డు రకం ధాన్యాలకు వేర్వేరుగా కేంద్రాలను నెలకొల్పి ఈ నెల 15వ తేదీ నాటికి ప్రతీ మండలంలో కనీసం ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ వర్తింపజేసి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే, అదనపు కలెక్టర్లు కె.గంగాధర్‌, పి.బెన్‌షాలోమ్‌, ఆర్డీవోలు అమరేందర్‌, శేఖర్‌రెడ్డి, డీపీవో సునంద, మునిసిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:35 AM