Share News

HYDRA: హైడ్రా, మూసీ ప్రాజెక్టులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 01 , 2024 | 06:08 PM

శుభ్రమైన నీరు. వాయువు అందించడమే మూసీ ప్రాజెక్ట్, హైడ్రా లక్ష్యాలని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వారు తీసుకున్న నిర్ణయాలను మరిచిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2017లో బీఆర్‌ఎస్ హయాంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యిందని ఆయన ప్రస్తావించారు.

HYDRA: హైడ్రా, మూసీ ప్రాజెక్టులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ కోసం చేపడుతున్న మార్కింగ్ ప్రక్రియపై బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుభ్రమైన నీరు. వాయువు అందించడమే మూసీ ప్రాజెక్ట్, హైడ్రా లక్ష్యాలని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వారు తీసుకున్న నిర్ణయాలను మరిచిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2017లో బీఆర్‌ఎస్ హయాంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యిందని ఆయన ప్రస్తావించారు. కాలుష్య నివారణకు, రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని 2017 కార్పొరేషన్ ఏర్పాటు చేశారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.


‘‘బీఆర్ఎస్ హయంలోనే ఆక్రమణలు, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో తేల్చాలని చెప్పారు. బఫర్ జోన్ బౌండరీలు నిర్ధారణ చేయాలని ఆదేశించారు. అక్కడ ఉన్నవారిని పంపించాలని తీర్మానించారు. 2020లో కేటీఆర్ మంత్రిగా ఉండగా బఫర్ జోన్ నిర్ధారించి ఇళ్లు కూల్చాలని నిర్ణయించారు. 2021లో మరో మీటింగ్ పెట్టి అక్రమ కట్టడాలు కూల్చాలని ఆదేశించారు. 2022లో మరో మీటింగ్ పెట్టి నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని చెప్పారు’’ అని పేర్కొన్నారు.


‘‘మూసీకి రెండు వైపులా 55 మీటర్లు రోడ్లు వేయాలని, 50 మీటర్లు బఫర్ జోన్‌గా గుర్తించాలని 2016లోనే జీవో 7 తీసుకొచ్చారు. యుద్ద ప్రాతిపదికన ఇళ్లు కూల్చాలని చెప్పారు. లక్షా 50 వేల క్యూసెక్కుల కంటే ఒక్క క్యూసెక్కు ఎక్కువ వచ్చినా ప్రాణ నష్టం జరుగుతుందని 2019లో ఓ సర్వే తేల్చింది. ఆనాడు మీరు ఆలోచన చేస్తే మంచిది. ఈ రోజు మేము మంచి నీరు, గాలి ఇవ్వాలనుకోవడం తప్పా?. మంచి ఆలోచనతో పని చేపడుతున్నాం. సమస్యను జఠిలం చేసేలా బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. కాళేశ్వరం, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఆనాడు మీరు ఎందుకు కనికరం చూపలేదు. అధికారం పోయి ఏం చేయాలో తోచక బురద చల్లుతున్నారు. కింది స్థాయి అధికారులు పొరపాట్లు చేస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం మాకు లేదు’’ అని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్

అశ్లీల వీడియోలు చూస్తే ఇకపై జైలుకే..

Updated Date - Oct 01 , 2024 | 06:10 PM