ఆస్తి చూసి రమ్మన్నారు.. కాజేసి గెంటేశారు
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:10 AM
ఓ వృద్ధ దంపతుల పరిస్థితి చూ స్తే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సం బంధాలే అనడం అతిశయోక్తి కాదేమోన ని అనిపిస్తోంది.
- తల్లిదండ్రులపై కన్నకొడుకుల దాష్టీకం
- జోగుళాంబ జిల్లాలో అమానవీయ ఘటన
- కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం శూన్యం
- కొడుకుల స్థానాన్ని భర్తీ చేసిన కూతురు.. అండగా నిలిచిన అల్లుడు
ఈ కలికాలంలో డబ్బులు, నగలు ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు భావిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రుల పాలిట కొడుకులే కాలయములవున్నారు. తన వారసుల కోసం కడుగు గంజి తాగి సంపాదించిన ఆస్తులు కాజేసి బయటకు గెంటేస్తున్నారు. మునుముందు తాము వృద్ధాప్యంలోకి వెళ్తామన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆస్తి కాజేసి వృద్ధ దంపతులను బయటకు గెంటేసిన అమానవీయ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో చోటుచేసుకున్నది.
మానవపాడు, అక్టోబరు 29 (ఆంధ్ర జ్యోతి): ఓ వృద్ధ దంపతుల పరిస్థితి చూ స్తే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సం బంధాలే అనడం అతిశయోక్తి కాదేమోన ని అనిపిస్తోంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం లోని నారాయణపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ పురం గ్రామానికి చెందిన వేమారెడ్డి, వెంకమ్మ దంపతులకు లక్ష్మిరెడ్డి, భీమిరెడ్డి ఇద్దరు కుమారులు. వేమారెడ్డికి వారసత్వంగా 20 ఎకరాల 27 గుంటల భూమి ఉండేది. పెద్దకుమారుడైన లక్ష్మిరెడ్డి పెళ్లికాకముందే మృతి చెందడంతో తండ్రి వద్ద ఉన్న ఆస్తి మొత్తం భీమిరెడ్డికి వారసత్వంగా సంక్ర మించింది. భీమిరెడ్డికి ముగ్గురు కుమారు లు, ఒక కూతురు వెంకట్రామ్‌రెడ్డి, లక్ష్మీ నారాయణమ్మ, వేణుగోపాల్‌రెడ్డి, జగదీష్ రెడ్డి ఉన్నారు. భీమిరెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమిని ముగ్గురు అన్నదమ్ములు పంచుకొని ఎవరికి వారు జీవనం సాగిస్తున్నారు. భీమిరెడ్డి సొంతంగా మరో 3-28 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలో కొంత సాగునీటి కెనాల్‌కు పోగా.. మరికొంత విక్రయించా రు. 1-34గుంటల భూమి మిగిలింది. భీమిరెడ్డి భార్య పద్మమ్మకు పుట్టింటివారు 1-25 గుంటల భూమి ఇచ్చారు. ఈ భూమి భీమిరెడ్డి, పద్మమ్మల పేర ఉన్నది. తల్లిదండ్రుల పేరుమీద ఉన్న ఆస్తిపై కన్నేసిన చిన్న కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి తాను సాదుతానని తల్లిదండ్రులను తన వద్దే పెట్టుకున్నాడు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ తీసుకుంటున్నాను.. నీ సం తకం అవసరం ఉందని తండ్రితో మా యమాటల చెప్పి స్టాంప్‌డ్యూటీ పత్రాల పై సంతకాలు చేయించుకొని 1-34 గుంటల భూమి జగదీశ్వర్‌రెడ్డి పేరుమీద మార్చుకున్నాడని తండ్రి భీమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2019లో తల్లిదండ్రులను తానే జీవి తాంతం పోషిస్తానని, అందుకు ప్రతిఫలంగా పుట్టింటివారి నుంచి తల్లికి సక్రమించిన ఆస్తిని తల్లి పద్మమ్మ తదనంతరం సంక్రమించేలా పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుకున్న రెండో కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి శాంతినగర్‌లో ఉన్న తన నివాసానికి తీసుకెళ్లాడు. నెల తిరగక ముందే పొలంపై లోను తీసుకుంటానని తల్లిని నమ్మించి తన భార్య వరలక్ష్మికి విక్రయించినట్లుగా సేల్‌డీడ్ ద్వారా మార్చుకున్నాడని తల్లి పద్మమ్మ వాపోతోంది. ఆ తర్వాత ఏదో వంకతో నిత్యం కొడుకు, కోడలు తమతో గొడవ పెట్టుకునే వారని, ఒకరోజు బయటకు గెంటేస్తే రెండు వారాలు అరుబయట ఉంటూ హోటల్ భోజనంతో కడపు నింపుకున్నామని వృద్ధ దంపతులు వాపోయారు. ఇరుగు పొరుగు వారి సాయంతో పోలీసు స్టేషన్ కు వెళ్లామని, తర్వాత మళ్లీ గొడవపెట్టు కుని మందుతాగి చావాలని, లేదా నేనే సంపుతానని బెదిరిస్తే.. తాము ఇక బతక లేమని ఆత్మహత్య చేసుకుంటామని కూ తురు లక్ష్మీనారయణమ్మతో విలపించినట్లు తెలిపారు. అల్లుడు జనార్దన్‌రెడ్డి సహా యంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి దంప తులకు కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. దీంతో మానవపాడు తహసీల్దారు చొరవ తీసుకుని కొడుకుల ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి చిన్నకొడు కు భాగానికి వచ్చిన పాత ఇంటిని ఇవ్వా లని, భృతి కింద ముగ్గురు కొడుకులు నెలకు రూ.9వేలు ఇవ్వాలని అదేశించారు. నివాసానికి ఇల్లు ఇచ్చారు.. కానీ భృతి మాత్రం అందడంలేదని, కూతురు అల్లుడే నెలకు భత్యం పంపి ఆదుకుంటున్నారని, ఇలాంటి కొడుకులు ఏ తల్లిదండ్రులకు ఉండరాదని, ఆ వృద్ధ దంపతులు ఆంధ్ర జ్యోతి ముందు కన్నీరుమున్నీరయ్యారు.